బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 6 జులై 2017 (11:46 IST)

సాయిధరమ్ మామూలోడు కాదు.. ఆమెను ఎలా వాడేస్తున్నాడో చూడండి (Video)

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపుపొందాడు. సోలో హీరోగా నటిస్తూనే... మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపుపొందాడు. సోలో హీరోగా నటిస్తూనే... మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.
 
తాజాగా కృష్ణవంశీ దర్శక్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నక్షత్రం". ఇందులో సందీప్ కిషన్‌తో పాటు సాయిధరమ్ కూడా ఓ పాత్రను పోషిస్తున్నాడు. సీనియర్ నేటి శ్రియ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. రెజీనా, ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
అయితే, సాయి ధరమ్ తేజ్ ప్రగ్యా జైశ్వాల్‌తో తీసిన "ఏ పాపా.. ఏ పాపమ్" సాంగ్‌ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో సాయిధరమ్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. ముఖ్యంగా హీరోయిన్‌ను అమాంతం కొరికేసేలా లీనమైపోయాడు. ఆ వీడియో మీరూ చూడండి. 
 
కాగా, ఈ చిత్రంలో పోలీస్ కావాలనే డ్రీమ్‌లో సందీప్ కిషన్ ఉండగా, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక పోలీసాఫీసర్ పాత్రలో కనిపించాడు. ఇక సాయిధరమ్ తేజ్ కూడా పోలీస్ పాత్రే అని స్పష్టం అవుతోంది. పోలీస్‌ను నడిపే ‘నక్షత్రం’గా ఈ సినిమాకి జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ చిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.