శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (14:33 IST)

మహాభారతం నా కల మాత్రమే.. సినిమా తీస్తానని చెప్పలేదు: రాజమౌళి

బాహుబలి దర్శకుడు జక్కన్న మహాభారతంపై సంచలన కామెంట్ చేశారు. త్వరలో రాజమౌళి మహాభారతం సినిమాను తెరకెక్కిస్తారని అందరూ అనుకుంటున్న వేళ... మలయాళంలో మోహన్ లాల్ భీమసేనుని కథా నేపథ్యంలో సాగే మహాభారతంలో నటిస్తు

బాహుబలి దర్శకుడు జక్కన్న మహాభారతంపై సంచలన కామెంట్ చేశారు. త్వరలో రాజమౌళి మహాభారతం సినిమాను తెరకెక్కిస్తారని అందరూ అనుకుంటున్న వేళ... మలయాళంలో మోహన్ లాల్ భీమసేనుని కథా నేపథ్యంలో సాగే మహాభారతంలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో తన మహాభారత కథను తెరకెక్కించే విషయాన్ని రాజమౌళి పక్కనబెట్టేశాడు. మలయాళంలో రూపొందుతున్న మహాభారతంలో అగ్ర నటులు నటించనున్న తరుణంలో.. ప్రస్తుతానికి ఆ మహా ప్రాజెక్టును పక్కనబెట్టేయాలనే ఆలోచనకు వచ్చాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
 
ఈ వార్తలను నిజం చేసేలా మహాభారతం సినిమా తన కల అని చెప్పానే కానీ ఆ కథ ఆధారంగా సినిమాను తీస్తున్నానని మాత్రం చెప్పలేదని రాజమౌళి అన్నారు. ప్రస్తుతం 'బాహుబలి 2' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నానని... ఇప్పటికిప్పుడు ఏ సినిమాను మొదలుపెట్టలేదన్నారు. త్వరలో తన తదుపరి ప్రాజెక్టు ప్రారంభమవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. 
 
''మహాభారతం'' సినిమాను రాజమౌళి తీస్తాడని గతంలో ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపిన నేపథ్యంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ, మహాభారతం సినిమాను తీయట్లేదన్నారు. బాహుబలికి తర్వాత తాను మహాభారతం సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.