1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rashmika Asked for more remuneration than Chaitu

చైతూ కంటే ఎక్కువ పారితోషికం అడిగిన రష్మిక మందన..?

rashmika
ఛలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన. ఆ తరువాత గీతగోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించికుంది. చాలా తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న కథానాయికలలో రష్మిక ఒకరు. వరుస అవకాశాలతో ఈ సుందరి దూసుకుపోతోంది. ఈ కారణంగానే ఈ అమ్మడు కాస్త కేర్ లెస్‌‌‌‌గా వ్యవహరిస్తోందనీ, పారితోషికం కూడా బాగా పెంచేసిందనే ప్రచారం ఈ మధ్య బాగానే జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది కూడా.
 
మళ్లీ ఇప్పుడు అదే రూమర్ షికారు చేస్తోంది. ఇటీవల చైతూకి జోడీగా చేయమని అడిగితే, ఆయనకంటే పారితోషికం ఎక్కువగా అడిగిందనే ప్రచారం జోరుగా చక్కర్లు కొడుతోంది. 'మజిలీ' తరువాత చైతూ ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. పూజా హెగ్డే వంటి హీరోయిన్‌‌‌కే అందులో సగం ఇస్తున్నారు. అందువలన ఆయనకంటే ఎక్కువ పారితోషికం ఇవ్వలేం అని అన్నారట. కాని అందులో ఎలాంటి నిజం లేదని ఆమె సన్నిహితుల చెప్పుకొచ్చారు. చైతూ కంటే ఎక్కువ పారితోషికాన్ని రష్మిక అడిగే అవకాశం లేదనీ, ఇదంతా ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమనేది సన్నిహితుల మాట.
తర్వాతి కథనం
నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు : బండ్ల గణేశ్