శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (09:20 IST)

నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు : బండ్ల గణేశ్

వైకాపా నేత, సినీ నిర్మాత  పీవీపీ వరప్రసాద్‌ను బెదిరించిన కేసులో తనను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కొట్టిపారేశారు. తనను ఏ పోలీసులు అరెస్టు చేయలేదంటూ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
వైకాపా నేత వీపీవీని బెదిరించిన కేసుతో పాటు.. కడప జిల్లాలో ఓ వ్యాపారి నుంచి అప్పు తీసుకుని, తిరిగి చెల్లించలేదన్న కారణంగా గురువారం రాత్రి ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ను హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారన్న సంగతి తెలిసిందే. 
 
దీనిపై శుక్రవారం ఉదయం బండ్ల గణేశ్ వివరణ ఇచ్చారు. నను ఎవరూ అరెస్ట్ చేయలేదని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, 'నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు. విచారణ కోసం పిలవడం జరిగింది. చట్టంపై గౌరవంతో వాళ్లు సహకరిస్తున్నారు. నన్ను అరెస్టు చేస్తే నేను మీకు తెలియజేస్తాను... మీ బండ్ల గణేష్' అంటూ ట్వీట్ చేశారు.