రియల్ దండుపాళ్యం జనవరి 21న విడుదల
Real Dandupalyam
Real Dandupalyam team
రామ్ ధన్ మీడియా వర్క్స్ అధినేత వాల్మీకి మాట్లాడుతూ, సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ రియల్ దండుపాళ్యం. ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించాడు దర్శకుడు మహేష్. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నో సంఘటనలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని సెంటర్స్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది. ఇది ఓటీటీలో కన్నా మంచి సౌండ్ సిస్టమ్ తో థియేటర్స్ లో చూడాల్సిన చిత్రం కాబట్టి థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.
నిర్మాత సి.పుట్టస్వామి మాట్లాడుతూ, మా చిత్రం నచ్చి రామ్ థన్ మీడియా వర్స్క్ వారు వరల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. రియల్ ఇన్సిడెంట్స్ కు దగ్గరగా రియల్ దండుపాళ్యం ఉంటుందన్నారు.

