మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (16:35 IST)

కన్నడ నటి రాగిణి ద్వివేదికి ఊరట.. బెయిల్ మంజూరు

మాదకద్రవ్యాల వినియోగం కేసులో జైలుకు వెళ్లిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి ఊరట లభించింది. ఈ కేసులో భాగంగా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. గతేడాది సెప్టెంబరులో.. ఓ డ్రగ్స్ పెడ్లర్తో నటి రాగిణి ద్వివేదికి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.
 
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న నేపథ్యంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద అక్టోబరులో ఆమెను అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. ఆమెతో సహా ఈ కేసుకు సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే, తన దగ్గర డ్రగ్స్కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని అంటున్న సదరు నటి.. బెయిల్ కోసం నవంబరు 3న కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు చుక్కెదురవ్వడం వల్ల.. ఆ తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గురువారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. రాగిణికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.