1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Release date fixed for Idupu Kayitam starring Priyadarshi

Priyadarshi: ప్రియదర్శి నటిస్తున్న ఇడుపు కాయితం విడుదల తేదీ ఫిక్స్

Iduu kagitam new poster
Megastar Chiranjeevi
ప్రొడ్యూసర్ బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ఇడుపు కాయితం.  ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. 
 
"ఇడుపు కాయితం" సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో మరే చిత్రానికీ లేనంతగా  ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దీంతో ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా బాగా ఆకర్షిస్తోంది. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. "ఇడుపు కాయితం" త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో దర్శక నిర్మాతలు షేర్ చేసుకోనున్నారు.
 
నటీనటులు - ప్రియదర్శి, నాగదుర్గ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు, తదితరులు
About Writer
దేవీ
తర్వాతి కథనం
Aishwarya: రహస్యాన్ని దాచి తిరు వీర్, ఐశ్వర్య ను పెళ్లి చేసుకుంటే ఏమయింది?