రోజా పూజాకార్యక్రమాలతో ప్రారంభించిన కొత్త సినిమా
Roja launching
దర్శకుడు శ్రీధర్ గతంలో ప్రముఖ కమీడియన్ షకలక శంకర్ తో ఫుల్ కమర్షీయల్ సినిమా శంభో శంకర తో కమర్షియల్ హిట్ కొట్టి, అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు అందుకున్నారు. ఇప్పుడు చేస్తున్న కథను సైతం వినూత్నంగా ప్రజెంట్ చేయనున్నారు, ఆయన మా నదీయాస్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ తొలి సినిమాతోనే మా బ్యానర్ కి సక్సెస్ అందిస్తారనే కాన్ఫీడెన్స్ ఉంది, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా ప్రొడక్షన్ నెం 1 సినిమా ఓపెనింగ్ కి విచ్చేసి మా అందరికీ తన శుభాశ్సిసులు అందిచిన, ఏపిఐఐసి ఛైర్మన్, శాసనసభ్యులు శ్రీమతి రోజాసెల్వమణిగారికి మా యూనిట్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు నిర్మాత ఏ ఎమ్ ఫెరోజ్. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలో త్వరలోనే అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.
మ్యూజిక్ - మణిశర్మ, సినిమాటోగ్రఫి - శ్రీసాయి, ఎడిటిర్ - ఛోటా కే ప్రసాద్, డైలాగ్స్ - హర్ష వర్దన్, పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
తర్వాతి కథనం
