సంబంధిత వార్తలు
- కాసిన్ని నవ్వుల కోసం "తేజ్ ఐ లవ్ యూ" - రివ్యూ (Video)
- ఆ టైటిల్ చూస్తే లిక్కర్.. ఈ పోస్టర్ చూస్తే గన్స్ : "దేవదాస్" ఫస్ట్ లుక్
- ''మురారి'' హీరోయిన్ సోనాలీ బింద్రేకు క్యాన్సర్.. షాకిస్తూ ట్వీట్
- పూరీ జగన్నాథ్ అలాంటోడా? అతని క్యారెక్టర్‌పై ఆరా తీసిన హీరోయిన్!
- మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? తమ్మారెడ్డి ఏమంటున్నారు?
భారీగా పెంచిన నయనతార... నోరెళ్లబెడుతున్న నిర్మాతలు
మలయాళ బ్యూటీ నయనతార తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసింది. ఆ రేటును చూసి నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా నయనతార మార్కెట్ బాగా పెరిగితోంది. మొదట్లో అందాలొలకబోయడానికే పరిమితమైన
మలయాళ బ్యూటీ నయనతార తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసింది. ఆ రేటును చూసి నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా నయనతార మార్కెట్ బాగా పెరిగితోంది. మొదట్లో అందాలొలకబోయడానికే పరిమితమైన ఈ కేరళా భామ ఆ తరువాత అభినయానికి అవకాశం ఉన్న పాత్రల్లో సత్తా చాటుకుంటోంది. ఇంకా చెప్పాలంటే అరం చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నంతగా నయనతార స్థాయి మారిపోయింది.
లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఈ సంచలన నటి స్థాయికి తగ్గట్టుగా పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందనే చెప్పాలి. అయినా చిత్ర అవకాశాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో సగం వరకూ లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలే కావడం విశేషం. అగ్రనటిగా రాణిస్తున్న నయనతార మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపిందన్నది తాజా సమాచారం.
దీంతో ఇదే అదునుగా భావించిన నయనతార.. తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారి భారీగా పెంచేసిందట. తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా హర్రర్ చిత్రాన్ని తెరక్కెస్తున్నారు. దీని తర్వాత నయనతార ప్రధాన పాత్రలో ఒక చిత్రం చేయడానికి రెడీ అవుఉన్నారు. ఈ చిత్రంలో నయనతారకు పారితోషికం అక్షరాలా రూ.5.5 కోట్లనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇదే గనక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార పేరు నమోదవుతుంది.
