1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sonika Chauhan death case: Actor Vikram Chatterjee arrested

మద్యం సేవించి అతివేగంతో కారు నడిపి ఆమె మృతి కారణమయ్యాడు.. యువ హీరో అరెస్టు

బెంగాల్ పోలీసుల యువ హీరోను అరెస్టు చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ మృతి కేసులో ఈ యువ హీరో విక్రమ్ చటర్జీని అరెస్టు చేశారు. మద్యం సేవించి అతి వేగంతో కారు నడిపి సోనికా సింగ్ మృతికి కారణమయ్యాడ

Sonika Chauhan death case
బెంగాల్ పోలీసుల యువ హీరోను అరెస్టు చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా చౌహాన్ సింగ్ మృతి కేసులో ఈ యువ హీరో విక్రమ్ చటర్జీని అరెస్టు చేశారు. మద్యం సేవించి అతి వేగంతో కారు నడిపి సోనికా చౌహాన్ సింగ్ మృతికి కారణమయ్యాడన్నది విక్రమ్ చటర్జీపై ప్రధాన ఆరోపణ.
 
గడచిన ఏప్రిల్ 29న వీరిద్దరూ ఓ పార్టీలో పాల్గొన్నారు. ఇద్దరూ కలసి మందు కొట్టారు. ఆపై కారులో తిరిగి వస్తున్న వేళ, మితిమీరిన వేగం కారణంగా అదుపు తప్పి పల్టీలు కొట్టి ఫుట్‌పాత్ పైకి వెళ్లి, ఓ దుకాణాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో సోనికా అక్కడికక్కడే మృతి చెందగా, విక్రమ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. 
 
అయితే, వీరిద్దరూ మద్యం సేవిస్తూ తీసుకున్న ఫోటోలను ఆ స్పాట్ నుంచి తమ స్నేహితులకు షేర్ చేశారు. ఈ ఫోటోలే ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. ఈ ఫోటోల ఆధారంగా చేసుకుని విక్రమ్ చటర్జీని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, విక్రమ్‌పై అభియోగాలు రుజువైతే 2 నుంచి పదేళ్ల వరకూ జైలుశిక్ష పడవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బర్త్‌డే పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసి ఐస్ క్రీమ్ బ్యూటీ...