కూర్చుంది చాలు `స్టాండప్..` అంటోన్న రాజ్‌తరుణ్
Rajtarun look
రాజ్‌తరుణ్ కెరీర్‌లోనే ఒక డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ జోనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో పాటు టైటిల్ ఆసక్తికరంగా ఉండడం,స్టైలిష్ మేకోవర్‌లో యూబర్-కూల్‌గా రాజ్‌తరుణ్ ఉన్న ఫస్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
మంగళవారంనాడు రాజ్‌తరుణ్ పుట్టినరోజు సందర్భంగా `స్టాండప్ రాహుల్` చిత్రం నుండి మరో స్పెషల్ పోస్టర్ రిలీజ్‌చేసి శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫి నిర్వహిస్తున్నారు. వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తర్వాతి కథనం
