1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The first single from the movie Gold Spot has been released.

Kajal Chowdary: గోల్డ్ స్పాట్ మూవీ ఫస్ట్ సింగిల్ పరిచయమే. రిలీజ్

Abhishek, Kajal Chowdary
Abhishek, Kajal Chowdary
అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం గోల్డ్ స్పాట్. అంబాజీపేట మ్యారేజి బ్యాండు దర్శకుడు దుష్యంత్ కటికనేని  ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ దర్శకుడిగా  పరిచయమవుతున్నారు. విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్నారు.
 
ఈ రోజు "గోల్డ్ స్పాట్" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'పరిచయమే..' రిలీజ్ చేశారు. ఈ బ్యూటిఫుల్ మెలొడీని మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ రెడ్డి కంపోజ్ చేసి సింగర్ తుషార నిలయతో కలిసి పాడారు. భార్గవ కార్తీక్ క్యాచీ లిరిక్స్ అందించారు. 'పరిచయమే..' సాంగ్ ఎలా ఉందో చూస్తే - 'ఓ మనసా అలుపే రాదు తలపున నీవుంటే, ఓ మనసా అదుపే లేదు ఎదురుగ నీవుంటే, వేల వర్ణాల ఆమనిగా పూల గంధాల పుష్యమిగా, పరిచయమే చిరు కథగా మొదలవగా, పరిణయమే తదుపరిగా మిగిలెనుగా, పరిచయమే చిరు కథగా మొదలవగా, పరిణయమే తదుపరిగా మిగిలెనుగా....' అంటూ ప్రేమికులవుతున్న చిన్ననాటి స్నేహితులు రామ్, శాంత మధ్య స్వీట్ మెలొడీగా చిత్రీకరించిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
 
ఇప్పటికే రిలీజ్ చేసిన "గోల్డ్ స్పాట్" సినిమా గ్లింప్స్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
జై జాస్తి, మేధ మేక హీరో హీరోయిన్‌లుగా మైత్రీ ఇన్ లవ్ ప్రారంభం