సంబంధిత వార్తలు
- దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?
- రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెెం.1 ప్లేస్ లో ప్రభాస్ రాజా సాబ్ మోషన్ పోస్టర్
- ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాజా సాబ్ మోషన్ పోస్టర్
- "రాజా సాబ్" నుంచి కొత్త అప్డేట్.. పోస్టర్ రిలీజ్.. ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్
- ప్రభాస్ బర్త్ డే సందర్భంగా "రాజాసాబ్" నుంచి మోస్ట్ అవేటెడ్ అప్డేట్
ప్రతిభగల వారికోసం ప్రభాస్ ప్రారంభించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్
Prabhas
రచయితలు తమ స్క్రిప్ట్ ను 250 పదాల నిడివిలో 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవచ్చు. వీక్షకులు చదివి తమ రేటింగ్స్ ఇచ్చేలా సైట్ రూపొందించారు. అత్యధిక రేటింగ్ పొందిన స్క్రిప్ట్ లను టాప్ ప్లేస్ లో ఉంచబోతున్నారు. తమ రచనకు వచ్చే రేటింగ్ రైటర్స్ కాన్ఫిడెన్స్ పెంచనుంది. 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ మొదటి ప్రయత్నంగా రచయితలకు మీ ఫేవరేట్ హీరోకు సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ లను ఇన్వైట్ చేస్తోంది.
ఈ సైట్ ద్వారా రైటర్, అసిస్టెంట్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలకు పనిచేసే అవకాశాలు పొందవచ్చు. 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ ద్వారా తమ కథలను రైటర్స్ ఆడియో బుక్స్ గా మార్చుకోవచ్చు. దీని వల్ల తమ స్క్రిప్ట్ లను మరింత మందికి చేరువయ్యేలా రైటర్స్ చేసుకోవచ్చు.
