సంబంధిత వార్తలు
- ఏదయినా ఎంజాయ్ చేస్తా, ధూం ధాంగా సెలబ్రేట్ చేసుకుంటా : హెబ్బా పటేల్
- తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2
- తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్ తో ధూం ధాం టీజర్ : డైరెక్టర్ మారుతి
- చైతన్య రావు, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్ప్రెస్ ఆహాలో ఆదరణ
- ఓదెల 2- ఓదెల విలేజ్ లో ఫైనల్ షెడ్యూల్ లో తమన్నా భాటియా
ట్రెండ్ కు భిన్నంగానే ధూం ధాం చేశా : చేతన్ కృష్ణ
Chetan Krishna
- నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరిక. ఫస్ట్ ర్యాంక్ రాజు, బీచ్ రోడ్ చేతన్, రోజులు మారాయి, గల్ఫ్ అనే మూవీస్ చేశాను. ఆ సినిమాల్లో కొన్నింటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి గుర్తింపు వచ్చింది. నాకు గోపీ మోహన్ గారి స్క్రిప్ట్స్ ఇష్టం. సకుటుంబంగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఆయన స్క్రిప్ట్స్ ఇస్తారు. అలాంటి మూవీ ఒకటి నేనూ చేయాలని అనుకున్నాను. ఇప్పటిదాకా విభిన్న తరహా చిత్రాల్లో నటించాను. ఒకసారి ఒక బిగ్ మూవీ చేద్దామని "ధూం ధాం" మొదలుపెట్టాం.
- తండ్రీ కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి ఎక్కడిదాకా అయినా వెళ్తారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాం. దానికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. మా మూవీలో ఫాదర్ తన కొడుకు అన్నింట్లో ది బెస్ట్ గా ఉండాలనుకుంటాడు. ఆయన చేసిన గారాబంతో కొడుకు మరింత అల్లరిగా తయారవుతాడు. తన వల్ల ఒక అమ్మాయి జీవితంలో ఏర్పడిన సమస్యకు తనే పరిష్కారం చూపించాలని ప్రయత్నం చేస్తాడు.
- మా మూవీలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. వారితో పాటు నటించడానికి బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. వాళ్ల టైమింగ్ తో మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించా. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ పట్టుకోవడం కష్టమైంది. ఆయన సినిమా సెకండాఫ్ లో వస్తారు. సినిమా మొత్తం ఉంటారు. ఈ సెకండాఫ్ మొత్తం పెళ్లి ఇంట సందడితో సాగుతుంది. ఇదే మా "ధూం ధాం" సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. సెకండాఫ్ లో థియేటర్ నిండా నవ్వులు నిండిపోతాయి. మొన్న వైజాగ్ లో ప్రీమియర్ వేసినప్పుడు కూడా సెకండాఫ్ లో నవ్వులు తప్ప మరే సౌండ్ థియేటర్ లో వినిపించలేదు.
- అదుర్స్ లాంటి సినిమాల్లో హీరో ఒక ఫేమస్ కమెడియన్ పక్కనే ఉంటూ కథ సాగుతుంది. అలా "ధూం ధాం"లో కూడా నేను వెన్నెల కిషోర్ గారి పక్కనే ఉంటాను. మూవీ షూటింగ్ టైమ్ లో కిషోర్ గారు చాలా సపోర్ట్ చేశారు. సీన్స్ చేసే ముందు నాతో డిస్కస్ చేసేవారు. హెబ్బా పటేల్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను షూటింగ్ స్టార్ట్ కాక ముందు చాలా ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటుంది. కెమెరా రోల్ కాగానే తన క్యారెక్టర్ లోకి మారిపోతుంది.
- నేను హీరోగా మంచి పొజిషన్ లో ఉండాలని నాన్న గారు కోరుకుంటారు. ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ప్రతి విషయంలో "ధూం ధాం" సినిమా ది బెస్ట్ గా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం మా సినిమాకు మరో అడ్వాంటేజ్. గోపీ సుందర్ గారు ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. ఒక సెంటర్ లో ఒక మంచి థియేటర్ ఉంటుంది. ఏ సినిమా అయినా అక్కడే ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడతారు. అలాంటి ఒకట్రెండు థియేటర్స్ చిన్న డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు. ఆ విషయంపై నేను ప్రీ రిలీజ్ లో స్పందించాను. అయితే మాకు కావాల్సినన్ని మంచి థియేటర్స్ దొరికాయి.
- ఇప్పుడు థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. నేనూ అదే చేస్తే వాటిలో మరొక థ్రిల్లర్ అవుతుంది. నేను గతంలో డిఫరెంట్ మూవీస్ చేసినప్పుడు అన్ని కమర్షియల్ ఫార్ములా మూవీస్ వచ్చాయి. ఇప్పుడున్న ట్రెండ్ కు భిన్నంగానే నేను "ధూం ధాం" చేశాను. తప్పకుండా ప్రేక్షకులు మా మూవీతో ఎంటర్ టైన్ అవుతారని, సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమా పూర్తయిన తర్వాత నా కొత్త మూవీ ప్లాన్ చేసుకుంటాను.
