బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (16:43 IST)

ఏదయినా ఎంజాయ్ చేస్తా, ధూం ధాంగా సెలబ్రేట్ చేసుకుంటా : హెబ్బా పటేల్

Hebba Patel
Hebba Patel
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు.

గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో "ధూం ధాం" సినిమా హైలైట్స్ ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపింది హీరోయిన్ హెబ్బా పటేల్.
 
- డైరెక్టర్ సాయి రాజేశ్ గారు ఒకరోజు ఫోన్ చేసి  "ధూం ధాం" ప్రాజెక్ట్ గురించి చెప్పారు. రైటర్ గోపీ మోహన్ దగ్గర కథ ఉంది. మీకు నచ్చితే చేయండి అన్నారు. నేను కథ విన్నాను. స్క్రిప్ట్ బాగా నచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఇది. ఈ మధ్య కాలంలో నేను అన్నీ సీరియస్ రోల్స్ చేస్తూ వస్తున్నాను. ఇలాంటి సినిమా నేను చేసి చాలా కాలమవుతోంది. నాకు రిఫ్రెషింగ్ గా ఉంటుందని అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పాను.
 
- "ధూం ధాం" సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుహానా. తనొక బబ్లీ గర్ల్. బాగా డబ్బున్న అమ్మాయి. ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల తను కోరుకున్న వెకేషన్ కు వెళ్తుంటుంది. అలా ఒక వెకేషన్ లో హీరోను కలుస్తుంది. అక్కడి నుంచి వారి స్నేహం, ప్రేమ మొదలవుతాయి. ఈ చిత్రంలో నటించడం నాకు కష్టంగా అనిపించలేదు. కేక్ వాక్ లాంటి ఫీలింగ్ కలిగింది. 
 
- చేతన్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను మంచి కోస్టార్. మా ఇద్దరిలో ఎవరు జూనియర్ , ఎవరు సీనియర్ అనేది చూసుకోలేదు. కెమెరా ముందు ఎవరు ఎంత యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేస్తాం అనేది ఆలోచించాం. పోలెండ్ లో లాంగ్ షెడ్యూల్ చేశాం. అక్కడ వింటర్ ఇంకా స్టార్ట్ కాకముందే వెళ్లాం. సాంగ్ షూట్స్ లో సారీస్ లో కనిపిస్తాను. చలి పెద్దగా లేకపోవడం వల్ల ఇబ్బందిగా అనిపించలేదు.
 
- మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారు టీమ్ మొత్తం ఎంతో కంఫర్ట్ గా ఉండేలా చూసుకున్నారు. పోలెండ్ లో కూడా ఏ రోజూ మాకు ఇబ్బంది కలిగించలేదు. ప్రొడ్యూసర్ గా మూవీ పర్పెక్ట్ గా వచ్చేందుకు తాను చేయాల్సిన సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు. మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ గా ఆయనకు పేరు వస్తుంది.
 
- డైరెక్టర్ సాయి కిషోర్ గారు చాలా జోవియల్ గా ఉంటారు. నాకు సరదాగా మాట్లాడుతూ ఉండే వ్యక్తులంటే ఇష్టం. సాయి కిషోర్ గారు అలాంటి పర్సన్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. "ధూం ధాం" టీమ్ లో నేను గతంలో పనిచేసిన కొందరు టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్లంతా ఉండటం వల్ల మూవీ షూటింగ్ సంతోషంగా జరిగింది.
 
- గోపీ సుందర్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. నాకు టమాటో బుగ్గల పిల్ల ఫేవరేట్ సాంగ్. అలాగే సాంగ్స్ మ్యూజికల్ గా ఎంత బాగుంటాయో విజువల్ గా కూడా అంతే బాగుంటాయి.
 
- "ధూం ధాం" సినిమాలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. నాకు వారితో పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేవు. హీరోకు ఉన్నాయి. మల్లెపూల టాక్సీ పాటలో మాత్రం నేను వారందరితో కలిసి కనిపిస్తాను. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఎంటర్ టైన్ మెంట్ తో "ధూం ధాం" సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మంచి ఫీల్ గుడ్ చిత్రమిది. తప్పకుండా ఈ నెల 8న థియేటర్స్ కు వెళ్లి చూడండి. 
 
- నా లైఫ్ లో "ధూం ధాం" చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. నా బర్త్ డే, కొత్త సినిమా సైన్ చేసిన రోజు, నా సినిమా హిట్ టాక్ వచ్చిన రోజున ధూం ధాం గా సెలబ్రేట్ చేసుకుంటా. నటిగా నాకు కెమెరా ముందు నిల్చున్న ప్రతి సందర్భం ఇష్టమే. సినిమా, వెబ్ సిరీస్, ఫొటో షూట్ ఏదయినా సరే ఎంజాయ్ చేస్తా.