బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (16:01 IST)

ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా ధూం ధాం సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్

Dho dham ANR poster
Dho dham ANR poster
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
 
ఈ రోజు తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనకు ట్రిబ్యూట్ గా "ధూం ధాం" సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ లోని మనసు గతి ఇంతే పాటను వెన్నెల కిషోర్ పాడుతున్న వీడియో ఆకట్టుకుంటోంది.
 
 గోపీసుందర్ స్వరపర్చిన పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ పాజిటివ్ వైబ్స్ తో "ధూం ధాం" సినిమాను హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
 
నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు