అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్
Chaitanya Rao, Hebba Patel
హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.
అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి 40 మిలియన్ల మినిట్స్ వ్యూస్ వచ్చాయి. మున్ముందు ఈ చిత్రం ఇంకెంత మందిని ఆకట్టుకుని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
