ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 జులై 2024 (15:17 IST)

హరోంహర : అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, దేశవ్యాప్తంగా ట్రెండింగ్

Malvika Sharma, Sudhir
Malvika Sharma, Sudhir
"హరోమ్ హరా" అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది.  కేవలం తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఉన్న సినీమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ లో వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు.
 
కారణం ఏమంటే.. గ్నానసాగర్ ద్వారక అన్యమైన అంశాన్ని ఎంచుకున్నారు - టాలీవుడ్‌లో ఆయుధాల తయారీ కధ. ఆయన దర్శకత్వం,  రచన ప్రశంసనీయం. డైలాగులు శక్తివంతంగా ఉంటాయి. సుదీర్ బాబు పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనను అందించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణలు. సునీల్ కీలక పాత్ర పోషించి సినిమాకు విలువను కలిగించారు. మాల్విక శర్మ కూడా సుదీర్ బాబు ప్రేయసిగా తన పాత్రను చక్కగా పోషించారు.
 
 వినూత్న కథ, శక్తివంతమైన నటన మరియు అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్  లో పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు మరింత ప్రచారం లభించింది.