ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (16:13 IST)

యాక్షన్ తో హరోం హర అనిపించిన సుధీర్ బాబు - రివ్యూ

Sudheer Babu  Harom Hara
Sudheer Babu Harom Hara
నటీనటులు: సుధీర్ బాబు, మాల్వికా శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్, సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్, దర్శకుడు: జ్ఞాన సాగర్ ద్వారక, ,నిర్మాత : సుమంత్ జి. నాయుడు
 
నిజీవితంలో ఆటగాడైనా సుధీర్ బాబు యాక్షన్ సినిమాలు చేయాలంటే ఆసక్తి కనబరుస్తారు. ఫుల్ యాక్షన్ సినిమా హరోం హరతో వచ్చింది. నేడే విడుదలైన ఈ సినిమా కుప్పం బ్యాక్ డ్రాప్ తీసుకుని చేశాడు. తెలుగులో ఇంతవరకు ఇలాంటి బ్యాక్ డ్రాప్ రాలేదని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ సినిమాతో నైట్రో స్టార్ నుంచి నవ దళపతి సుధీర్ బాబుగా పేరుకు టాక్ తగిలించుకోవడం విశేషం. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
కుప్పం అనేది మూడు రాష్ట్రాల సరిహద్దుగా వుంటుంది. అక్కడ  పాలిటెక్నిక్ లో ఉద్యోగిగా పక్క ఊరునుంచి సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) వస్తాడు. తండ్రి జయప్రకాష్ ఊరిలో అప్పులు చేసి అభాసుపాలవుతాడు. ఆ అప్పును తీర్చేందుకు మూడు నెలలు టైం అడుగుతాడు సుబ్రహ్యనం. అప్పటికే  కుప్పంలో రౌడీలతో గొడవపడడంతో ఉద్యోగం కాస్తా పోతుంది. దాంతో సప్పెండ్ అయిన పోలీస్, స్నేహితుడైన సునీల్ తో ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా కత్తులతో నరుక్కుని చంపుకునే కల్చర్ వున్న రౌడీ మూకకు గన్స్ సప్లయి చేసేందుకు సిద్ధం అవుతాడు సుబ్రహ్మణ్యం. అందుకు వారు ఏ  విధంగా ప్లాన్ చేశారు. చివరికి వారి ప్లాన్ వర్కవుట్ అయిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
కథ నేపథ్యం 1980 దశకం చిత్తూరు జిల్లా కుప్పం కనుక అందుకు సరిపడా సెట్ వేయడంతోపాటు అప్పటి కల్చర్, పనిముట్లు, ఇండ్లు అన్నీ సెట్ వేసి మెప్పించారు. కుప్పంలో వున్న రౌడీ బ్యాచ్ అతి క్రూరంగా పురాణాల్లో మనం చవివిన రాక్షస ప్రవిత్తి గల వాళ్ళు. నచ్చిన స్థలాన్ని కబ్జా చేయడం, మెచ్చిన అమ్మాయిని బలవంతంగా లోబర్చుకోవడం, ఎదురుతిరిగి తలలు తెగనరకం ఈ రౌడీల వ్రిత్తి. అందుకు సుబ్రహ్మణ్యం ఏవిధంగా వారి రూటుల వెళ్ళి వాళ్ళకు తలనొప్పిగా తయారయ్యాడనేది మిగిలిన సినిమా.
 
ఈ సినిమా సుధీర్ బాబు వన్ మేన్ షో. సీరియస్ యాక్షన్, మధ్యతరగతి జీవిత పోరాటం, అన్యాయంపై ఎదురుతిరిగేలా తను చేసిన నటన హైలైట్ అవుతుంది.  తన కథా ఎంపిక నుంచి తన పాత్రలకి తాను ఇస్తున్న పెర్ఫామెన్స్ లు చాలా బాగున్నాయని చెప్పాలి. సుధీర్ బాబు కథకు పూర్తి న్యాయం చేశాడనే చెప్పాలి.  
 
ఫలని స్వామిగా సునీల్, మాళవిక మోహనన్ పాత్ర కూడా బాగుంది. ఇంకా విలన్ పాత్రల్లో కనిపించిన నటుడు కేజీయఫ్ ఫేమ్ లక్కి లక్ష్మణ్ పాత్రకు సరిపోయాడు.  మిగిలిన ఫాత్రలు ఓకే.
 
ఇది పూర్తి యాక్షన్ సినిమా కాబట్టి నేపథ్యం వేరయినా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం తమిళ విజయ్,  కమల్ విక్రమ్, కెజిఎఫ్. ఛాయలు గుర్తుకు వస్తాయి. సాంకేతికపరంగా చూస్తే, చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాకు వన్నె తెచ్చింది. ఇలాంటి కథలో పాటలు వుండవు కనుక ఉన్నంతలో ఓ సాంగ్ ను దర్శకుడు చూపించాడు.  ముగింపులో వచ్చే యాక్షన్ సన్నివేశం కథకు సరిపడా రాసుకున్నాడు.
 
ఈ సినిమాలో చిత్తూరు యాసతో అందరూ సంభాషణలు బాగున్నాయి.   కథని చెప్తూ తీసుకెళ్లే విధానం యాస కూడా సరిపోయింది. కొన్ని చోట్ల బలవంతంగా సాగే సీన్లు వున్నాయి. అవి కట్ చేస్తే బాగుండేది. అలాగే కొన్ని సీన్స్ లో లాజిక్స్ కనిపించవు. మరి కొన్ని చోట్ల వేరే సినిమాలు గుర్తుకురావడం మైనస్. ఇక మాళవిక పాత్రకి సినిమాలో ప్రాధాన్యత కనిపించదు.
 
కథానుగుణంగా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ బాగుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బానే ఉంది కాని కొన్ని సీన్స్ ని వేగవంతం చేయాల్సింది. దర్శకుడు జ్ఞ్యానసాగర్ ద్వారక  ఈ సినిమాతో మెప్పించాడు కానీ చాలా రొటీన్ కథని తీసుకున్నాడు. డైలాగ్స్ ని బాగా రాసుకున్నాడు  కానీ కథనాన్ని మరింత కొత్తదనంగా చూపిస్తే పాత సినిమాలు గుర్తుకురాకుండా పోయేవి. అప్పటి కథల్లో విలనిజం అంటే చాలా సినిమాల్లో వుండేదే కనిపిస్తుంది. ఊహకనందని విధంగా కథను రాసుకుంటే సినిమా మరోలా వుండేది. యాక్షన్ ప్రియులకు సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 2.5/5