మహేష్ బాబు లెవంత్ మైల్ అయితే నేను ట్వెల్త్ మైల్ కి గురి పెట్టా : సుధీర్ బాబు
హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. యంగ్ హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సుధీర్ బాబు ఆడియో ఇంట్రాక్షన్ ని రిలీజ్ చేశారు. ఆడియో ఇంట్రాక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హరోం హర టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా ట్రైలర్ చూశాను. చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించారు. బ్యాగ్ డ్రాప్, ప్రిమైజ్ కొత్తగా వుంది. ఈ రోజుల్లో ఆడియన్స్ ఇలాంటి బ్యాక్ డ్రాప్ ని ఇష్టపడుతున్నారు. హరోం హర టైటిల్ ట్రాక్ చాలా నచ్చింది. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు గా వచ్చిన విశ్వక్, అడివి శేష్ కి థాంక్స్. మా నాన్న గారు ఫస్ట్ టైం నా సినిమాకి సంబధించిన ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. ఆయన రైట్ సినిమాకే వచ్చారని నాకు తెలుస్తుంది. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో 'నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఏమ్ ఫర్ ది లెవంత్ మైల్' అని వుంటుంది. నేను ట్వెల్త్ మైల్ కి గురి పెట్టాను. కొట్టాను. ఒక సాలిడ్ సినిమా తీసి, ఎంతో మందికి చూపించి, వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాను. ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోతుంది, ఈ ఫ్రేం ఎలా చూస్తే అదిరిపోతుందనే అప్రోచ్ తో ఈ సినిమా చేశాం. ట్రైలర్ లో చూస్తున్న ప్రతి డిటేయిల్ టీం అందరి ఎఫర్ట్ వుంది. ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఎలాంటి సినిమా రాలేదు. సినిమా చూసినప్పుడు ఆడియన్స్ ఇదే ఫీల్ అవుతారు. జూన్ 14న ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సూపర్ స్టార్ట్ కృష్ణ గారు నా మావయ్య. నా హీరో. హరోం హర ఆయన కోరుకున్న సినిమా. ఆయన నన్ను ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలని అనుకున్నారో అలాంటి సినిమా అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను. ఆయన ఆశీస్సులు వుంటాయి.
డైరెక్టర్ జ్ఞానసాగర్ ఓ తుపాకీ పట్టుకొచ్చి ఈ కథని నెరేట్ చేశాడు. తను ఊహించిన వరల్డ్ ఎలా వుంటుందో క్లియర్ గా అర్ధమైయింది. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్ కి థాంక్స్. ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్ళినా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా వుంటుంది. ప్రొడ్యూసర్స్ సుమంత్, సుబ్రహ్మణ్యం ఈ కథకు ఫుల్ గా జస్టిస్ చేశారు. ఈ సినిమాతో ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ గా నిలబడతారు. డివోపీ అరవింద్ అదరగొట్టాడు. చేతన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. మ్యూజిక్ అదిరిపోయింది. సినిమా చూసిన ప్రతి ఆడియన్ సుబ్రమణ్యంలా ఫీలౌతాడు. దీనికి ముఖ్య కారణం చేతన్ ఇచ్చిన మ్యూజిక్. తన ఫ్యూచర్ లో పెద్ద హీరోలతో పని చేస్తాడనే నమ్మకం వుంది. ఆర్ట్ డైరెక్టర్ రాము గారు ఎక్స్ లెంట్ వర్క్ చేశారు. ఎడిటర్ రవితేజ గారు ఎక్స్ లెంట్ గా చేశారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. హీరోయిన్ మాళవిక చాలా స్ట్రాంగ్ రోల్ చేసింది. తనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. సునీల్ గారు ఫుల్ లెంత్ రోల్ లో కం కనిపిస్తారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అర్జున్, లక్కీ లక్ష్మణ్.. అందరికీ పేరుపేరున థాంక్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి థాంక్స్. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా సపోర్ట్ ఇచ్చారు. మహేష్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎట్ లీస్ట్ త్రీ ఇయర్స్ పట్టొచ్చు. ఆ స్పెస్ నేను పూర్తి చేస్తానని చెప్పడం లేదు. అది ఏ హీరో వల్ల సాధ్యం కాదు. మహేష్ సినిమా ఫుల్ బాటిల్ కిక్ ఇస్తుంది. కానీ నేను ఒక్కటి చెప్పగలను. నేను ఫుల్ బాటిల్ ఎంటర్ టైన్మెంట్, కిక్ ఇవ్వలేను కానీ చిన్న పెగ్ అయితే ఇస్తాను. మహేష్ సినిమా విడుదలయ్యేలోపల ప్రతి సినిమాతో చిన్న పెగ్ పెగ్ ఇస్తూ ఫుల్ బాటిల్ ఇస్తాననే నమ్మకం వుంది. అది హరోం హరతో మొదలౌతుంది. జూన్ 4న రిజల్ట్స్ వచ్చాయి. కుప్పం నుంచి చంద్రబాబు గారు గెలిచారు. జూన్ 14న సుబ్రహ్మణ్యం హరోం హర నుంచి వస్తున్నాడు. వాడూ గెలుస్తాడు. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ అంతా కాలర్ లేపుకుంటూ వెళ్తారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాకపోయినా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు మా హీరోకి కూడా ఇలాంటి పడితే బావుటుందని ఫీలౌతారు. హరోం హర అలాంటి సినిమా అవుతుంది. జూన్ 14 హరోం హర ప్లీజ్ డూ వాచ్' అన్నారు.