సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (17:57 IST)

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

Krishna-Mahesh
Krishna-Mahesh
సూపర్ స్టార్ క్రిష్ణ 81 వ జయంతి సందర్బంగా అభిమానులు పలురకాలుగా పలుచోట్ల వేడుకలు చేస్తున్నారు. ఈరోజు ఆయన కొడుకు మహేష్ బాబు తన తండ్రిని తలచుకుంటూ ఇన్ స్ట్రాలో ఐ మిస్ యూ నాన్నా.. అంటూ గుర్తుచేసుకుని ఫొటోలు షేర్ చేశారు. తెలుగు చలన చిత్రరంగంలో ఓ ఐకాన్ గా నాన్నగారు వున్నారు.  ఆయన చేసిన 350 సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు.
 
సూపర్ స్టార్ క్రిష్ణ యంగ్ ఏజ్ లో వున్న ఫొటో నుకూడా పోస్ట్ చేసిన మహేష్ బాబు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పారు. మాకు రోల్ మోడల్ గా నిలిచారు అంటూ స్పందించారు. హ్యాపీ బర్త్ డే నాన్న.. ఐ మిస్ యూ నాన్న. ఎల్లప్పుడు మీ జ్నాపకాలు మా మదిలో వుంటాయి అని మహేష్ పేర్కొన్నారు. తాజాగా మహేష్ నటించనున్న సినిమా త్వరలో సెట్ పైకి ఎక్కనుంది. రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటించనున్నారు.