శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (14:33 IST)

అమెజాన్ ప్రైమ్ ప్రైమ్ సేల్ : అనేక ఉత్పత్తులపై 70 శాతం డిస్కౌంట్!

amazon
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ప్రైమ్ సేల్‌ను నిర్వహించింది. ఈ నెల 20, 21వ తేదీనల్లో ఈ సేల్‌ను నిర్వహించింది. ఈ విక్రమంయలో భాగంగా, శామ్సంగ్ గెలాక్సీ ఎం35, ఐక్యూఓఓ జడ్ 9 లైట్, మోటరోలా 50 అల్ట్రా, లావా బ్లేజ్ ఎక్స్ వంటి 5జీ స్మార్ట్‌ఫోన్లను ఆయా కంపెనీలు ఆవిష్కరించనున్నాయి. రెడ్మీ 13, వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, రియల్మీ జీటీ 6టీలో కొత్త వేరియంట్లు అందుబాటులోకి వస్తాయని అమెజాన్ ప్రకటించింది. 
 
ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు అన్నీ కలిపి ఐఫోన్ 13 రూ.47,999కు, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ఏఐ స్మార్ట్ ఫోన్లు రూ.74,999కు, వన్ ప్లస్ 12 రూ. 52,999కు లభిస్తాయని తెలిపింది. షియామీ ఫోన్లు రూ.7699 నుంచి, రియల్మీ రూ.7499 నుంచి, వివో రూ.7249 నుంచి, పోకో రూ.6499 నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కంప్యూటర్ విడిభాగాలు, హెడ్ ఫోన్లపై 75 శాతం వరకు, ల్యాప్‌ట్యాప్‌లపై రూ.45000 వరకు, ట్యాబ్‌లపై 60 శాతం వరకు రాయితీ లభిస్తుందని పేర్కొంది. సీపీ ప్లస్ 2 ఎంపీ సెక్యూరిటీ కెమేరా రూ.1000లో పే విక్రయిస్తామంది. 
 
ఇకపోతే, టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్‌లకూ సోనీ, శామ్‌సంగ్, ఎలీ, రెడీ, హైసెన్స్, వీయూ, టీసీఎల్, ఏసర్ వంటి బ్రాండ్ల టీవీలపై 65 శాతం వరకు, వాషింగ్ మెషీన్లపై 60 శాతం వరకు, ఏసీలు, రిఫ్రిజరేటర్లు, డిష్ వాషర్లపై 55 శాతం వరకు, చిమ్నీలపై 65 శాతం వరకు రాయితీ ఉంటుందని తెలిపింది. ఫ్యాషన్ బ్యూటీ ఉత్పత్తులపై 50-80 శాతం, ఫాసిల్-ఆర్మనీ వంటి ప్రీమియం వాచీలపై కనీసం 50 శాతం, హీటర్లు- గ్రైండర్లు- వ్యాక్యూమ్ క్లీనర్లపై 35 శాతం, పరుపులు - ఫర్నీచర్‌పై 50 శాతం, పుస్తకాలు, స్టేషనరీపై 50-70 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొంది. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు, ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో చెల్లింపులపై 10 శాతం పొదుపు చేయొచ్చని వివరించింది. వడ్డీలేని సులభ వాయిదాలతో పాటు పాత వస్తువులను మార్పిడి చేసుకోవచ్చనీ ప్రకటించింది.