శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-07-2024 బుధవారం దినఫలాలు - ఉద్యోగస్తులకు అధికారులు నుంచి మంచి గుర్తింపు...

astro2
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ ఏకాదశి సా.5.54 అనూరాధ రా.1.18 ఉ.శే.వ.5.52 కు ప.దు. 11.37 ల 12.30.
 
మేషం :- ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ వహించండి. పరిచయాలు మరింతగా బలపడతాయి. విద్యార్ధినులు ప్రేమ వ్యవహరాల్లో లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. గృహ మరమ్మతులు వాయిదాపడతాయి. రుణ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కుంటారు.
 
వృషభం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కోవలసి వస్తుంది.
 
మిథునం :- ఉద్యోగస్తులకు అధికారులు నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు వాయిదా పడతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. కార్యసాధనలో ఒర్పు, పట్టుదల అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం :- స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
సింహం :- ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. లాయర్లు చికాకులు తప్పవు. స్త్రీలకు చుట్టు పక్కలవారితో విబేధాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా మొండిధైర్యంతో ముందుకుసాగి పూర్తిచేస్తారు.
 
కన్య :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. అనుకున్న పనులలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు వంటివి ఎదుర్కొనక తప్పదు. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలను తెచ్చుకోకండి. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు.
 
తుల :- స్త్రీలు టి.వి.,ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరదు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు.
 
వృశ్చికం :- ముఖ్యమైన వ్యవహారాలల్లో మిత్రుల సలహా పాటిస్తారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. అధికారులకు పర్యటనలు, తనిఖీలు అధికం. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు తారుమారవుతాయి.
 
ధనస్సు :- కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. చేయని యత్నాలకు ప్రతిఫలం ఆశించకండి. కళ, క్రీడా, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- ఒక సమావేశానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పాత సమస్యలు పరిష్కరిస్తారు. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. మీకు రాబోయే ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు సిద్ధిమవుతుంది. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది.
 
కుంభం :- బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగ, వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి ఉండదు. మీ శ్రీమతి తీరు చికాకు కలిగిస్తుంది. రియల్ఎస్టేట్ వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
మీనం :- బంధువులను కలుసుకుంటారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కోర్టు వ్యాజ్యాలు, వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.