గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-07-2024 శనివారం దినఫలాలు - ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు...

Astrology
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ సప్తమి ప.12.19 హస్త ప.5.31 రా.వ.2.19 ల 4.05. ఉ.దు. 5.34 ల 7.17.
 
మేషం :- శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలుంటాయి. ఐరన్, సిమెంట్, కలప రంగాలలోనివారికి నిరుత్సాహం తప్పదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
వృషభం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. సాంఘిక, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు తోటివారి మాట ధోరణి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
మిథునం :- స్త్రీలకు పరిచయాలు, వ్యాపాకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు తరచూ సభ, సమావేశాలలో పాల్గొంటారు. సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
కర్కాటకం :- స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. సాంకేతిక, వైద్య రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు విరక్తి కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు లాభదాయకం.
 
సింహం :- ఇరుగు, పొరుగువారితో కలహాలు తలెత్తుతాయి. రుణాలు చేయవలసివస్తుంది. కష్టకాలంలో బంధువుల అండగా నిలుస్తారు. నిరుద్యోగులకు ప్రకటన పట్ల అవగాహన ముఖ్యం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మీ సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.
 
కన్య :- దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. రాబడికి మించి ఖర్చులున్నా ఇబ్బందులుండవు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురైన ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.
 
తుల :- ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. కుటుంబీకులతో కలిసివిందు, వినోదాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. హామీలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి చికాకులు తప్పవు.
 
వృశ్చికం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలకు ఇంటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. నిగ్రహం పాటించటం క్షేమదాయకం. దంపతుల మధ్య సఖ్యతా లోపం, పట్టింపులు చోటుచేసుకుంటాయి. ప్రముఖుల సిఫార్సుతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది.
 
ధనస్సు :- స్త్రీలు వస్త్రాలు, ఆభరణాల పట్ల ఆకర్షితులవుతారు. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసి ఉంటుంది. బులియిన్ వ్యాపారులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. మీ సమస్యలు, చికాకులు తాత్కాలికమేనని గమనించండి. మీరు అమితంగా అభిమానించే వారిని కలుసుకుంటారు.
 
మకరం :- ఫ్లీడర్లు, ఫ్లీడర్ గుమస్తాలకు ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తాయి. పాత బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. కొత్త పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఎవరినీ అతిగానమ్మవద్దు.
 
కుంభం :- ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయలుకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఉమ్మడి వ్యవహరాలు, భూ పంపకాల్లో ఏకాగ్రత అవసరం. ప్రతి పనిలోను ఉత్సాహం కనబరుస్తారు. కొంతమంది మిమ్ములను ఉద్రేకపరిచేలా సంభాషిస్తారు.
 
మీనం :- సేవ, పుణ్య కార్యక్రమంల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ట్రాన్స్‌పోర్టు, రవాణా రంగాల వారికి పురోభివృద్ధి. అకాల భోజనం, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలో పునరాలోచన అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది.