ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-07-2024 గురువారం దినఫలాలు - ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు....

saibaba
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ పంచమి ఉ.8.21 పుబ్బి ప.12.19 రా.వ.8.18 ల 10.04. ఉ.దు. 9.53 ల 10.45 ప.దు. 3.06ల 3.58.
 
మేషం :- హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. ఎవరికీ బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కాళ్లు, చేతులకు సంబంధించిన చికాకులు తప్పవు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం :- ఉద్యోగస్తులకుపై అధికారులు నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. షాపింగులో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ సంతానం కోసం విలువైన వస్తువులను సేకరిస్తారు. తాపి పనివారలకు వాతావరణంలోని మార్పు వల్ల చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు అనుకోని విధంగా వాయిదాపడతాయి.
 
మిథునం :- రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. సోదరుని వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
కర్కాటకం :- ఫ్యాన్సీ, కిళ్ళీ, కిరాణా రంగాలలో వారికి అనుకూలం. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యతమినహా ఆదాయం సంతృప్తికరంగా ఉండదు. బంధువుల రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటారు.
 
సింహం :- వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబీకుల మద్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
కన్య :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రముఖులకు కానుకలు సమర్పించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
తుల :- ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదు. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయవచ్చు.
 
వృశ్చికం :- బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ప్రేమవ్యవహారాలు పెళ్ళికి దారితీయవచ్చు. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
ధనస్సు :- వేళతప్పి ఆహారం భుజించడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తగలవు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం, ప్రతిఫలం స్వల్పం. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మకరం :- రసాయనిక సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానరాగలదు. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. ఉమ్మడి వ్యవహరాలు, ఆస్తి పంపకాలు ఒకకొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. కొత్తవ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. అతిగా సంభాషించడం అనర్థదాయకం అని గమనించగలరు.
 
కుంభం :- ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది, ధనం మితంగా వ్యయం చేయాలి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి. కీలక వ్యవహారాల్లో పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
 
మీనం :- సంతానం మొండి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు.