సోమవారం, 18 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

16-07-2024 మంగళవారం దినఫలాలు- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు..?

Money
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ దశమి సా. 5. 05 విశాఖ రా. 11.57 తె.వ. 4.10 ల. ఉ. దు. 8.09ల 9.01 రా. దు. 10. 57 ల 11.41.
 
మేషం:- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రిప్రజెంటేటివ్లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రేమాను బంధాలు, ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి. 
 
వృషభం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటాయి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేసుకుండా సద్వినియోగం చేసుకోండి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. ముఖ్యుల ఆరోగ్యము మిమ్మల్ని నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతతలోపిస్తుంది.
 
 
మిధునం:- వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కుంటారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల వ్యవహారంలో అనుభవిజ్ఞుల సలహా పాటించండి. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి.
 
 
కర్కాటకం:- వృత్తుల వారకి శ్రమాధిక్యత మినహా ఆదాయ సంతృప్తి ఉండదు. అధికారులు, ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షిణ తప్పదు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మీరు ఆశించిన మార్పు సంభవిస్తుంది. విద్యార్థులకు రెండవ విడత కౌన్సెలింగ్ అనుకూలం. 
 
సింహం:- ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. బంధుమిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తె ఆస్కారం ఉంది మెళకువ వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి.
 
 
కన్య:- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. తలపెట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఏ విషయంలోను తొందరపడి మాట ఇవ్వటం శ్రేయస్కరం కాదు.
 
 
తుల:- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు.
 
 
వృశ్చికం:- వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోలు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ఉత్తమం. మీ ఊహలు, అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. రియల్ ఎస్టేట్, చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఆటుపోట్లు అధికమవుతాయి. 
 
ధనుస్సు:- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అధికారులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కోర్టు విషయాల్లో ప్రతికూలత తప్పకపోవచ్చు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
మకరం:- రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. స్త్రీలకు ఆర్జన, విలాస వస్తువుల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
బంధువుల ఉల్లాసంగా గడుపుతారు. సిమెంటు, ఇసుక, ఇటుక, తాపి పనివారికి చికాకులు అధికమవుతాయి.
 
 
కుంభం:- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ప్రయాణాల వలన అధిక ధన వ్యయం అవుతుంది. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. ద్విచక్ర వాహనంపై దూర
ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. రైతులు వ్యవసాయ రుణాలు, విత్తనాల కోసం ఆందోళన చెందుతారు.
 
 
మీనం:- రచయితలు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంతజాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. బంధు మిత్రుల పట్ల సంయమనం పాటించండి. విద్యార్థులకు టెక్నికల్, కంప్యూటర్ సైన్సులో ప్రవేశం లభిస్తుంది. కొంతమంది మీ పలుకుబడిని దుర్వినియోగం చేయటం వల్ల మాటపడవలసి వస్తుంది.