సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (15:07 IST)

తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్ తో ధూం ధాం టీజర్ : డైరెక్టర్ మారుతి

teaser launched by Maruthi
teaser launched by Maruthi
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

నవంబర్ 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ మారుతి "ధూం ధాం" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో టీజర్ చాలా బాగుందని చెప్పిన మారుతి, మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.
 
హీరో హీరోయిన్లు చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ లవ్ స్టోరీతో "ధూం ధాం" సినిమా టీజర్ ప్రారంభమైంది. ఈ లవ్ స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. చేతన్ కృష్ణ చేసిన విలేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ పెళ్లి సందడిలో డిజైన్ చేసిన కామెడీ ట్రాక్ ఎంటర్ టైనింగ్ గా ఉంది. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్, కామెడీ..ఇలా థియేటర్ లో ప్రేక్షకుడు చూసి ఎంజాయ్ చేసే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో "ధూం ధాం" టీజర్ ఇంప్రెస్ చేస్తోంది.