సంబంధిత వార్తలు
- వేతన జీవులకు నిరాశ : ఆదాయపన్ను జోలికి వెళ్లని కేంద్రం
- బ్యాంకులతో పోస్టాఫీసుల అనుసంధానం : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- రూ. 1000కి చేరువలో గ్యాస్ బండ: బడ్జెట్టులో బండ బరువు దించుతారా?
- 2022 వార్షిక బడ్జెట్: వైజాగ్ రైల్వే జోన్ పరిస్థితి ఏంటి?
- బడ్జెట్ 2022: రూ. 10 లక్షల ఆదాయపు స్లాబ్‌కి పైన వున్నవారికే వడ్డింపు?!!
టిక్ టాక్ దుర్గారావు దూసుకుపోతున్నాడు...
టిక్ టాక్ ఎంతోమంది స్టార్లుగా మార్చింది. అంతే కాదు కొంతమంది బుల్లితెరపైకి, మరికొంతమంది వెండితెరపైకి కూడా తీసుకెళ్ళింది. టాలెంట్ ఉంటే అవకాశాలు ఏ విధంగానైనా వస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా అందరూ గతంలో భావించారు. అందులో ప్రథముడిగా చెప్పుకోవాల్సింది తెలుగోడు దుర్గారావు.
ఇతని ఇంటి పేరే టిక్ టాక్ దుర్గారావుగా మారిపోయింది. తన సతీమణితో కలిసి వెరైటీ డ్యాన్సులు వేస్తూ లక్షలాదిమంది అభిమానులు సంపాదించుకున్నాడు దుర్గారావు. తన హావభావాలు, తెలిసీతెలియని డ్యాన్సులతోనే మంచి పేరును సంపాదించుకున్నాడు.
అయితే ఈమధ్య దుర్గారావు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను మాత్రమే చేస్తున్నాను. ఆ వీడియోలు నాకు 2 లక్షల దాకా తెచ్చిపెడుతున్నాయి.
అలాగే మాటీవీ, జిటీవీ లాంటి ఛానళ్ళలోను కొన్ని కార్యక్రమాలను చేస్తున్నాను. మరికొన్ని కార్యక్రమాలకు నన్ను, మా ఆవిడను ఆహ్వానిస్తున్నారు. అక్కడ డబ్బులు వస్తోంది. అసలు చెప్పాలంటే జబర్దస్ ఆర్టిస్ట్‌ల కన్నా నా ఆదాయం ఎక్కువేమో అంటున్నాడు దుర్గారావు.
