గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (11:39 IST)

హీరో రాజశేఖర్ హాస్టల్ అమ్మాయిలను వాడుకున్నాడు.. జీవిత రాజశేఖర్ అలా?

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ గురించి నిజానిజాలు బయటికొస్తున్నాయి. ఓ టీవీ ఛానల్ చర్చాకార్యక్రమంలో సామాజిక కార్యకర్త సంధ్య చేసిన వ్యాఖ్యలు సంచ

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ గురించి నిజానిజాలు బయటికొస్తున్నాయి. ఓ టీవీ ఛానల్ చర్చాకార్యక్రమంలో సామాజిక కార్యకర్త సంధ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. జీవిత రాజశేఖర్ స్వయంగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్‌కు ఫోన్ చేసి పేద అమ్మాయిలను, ఫీజుల్లేక ఇబ్బంది పడే అమ్మాయిలను తన భర్త కోసం వాడుకుందని ఆరోపించారు.
 
ఇది అక్షరాలా నిజమని.. ఆ రోజుల్లో హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌ ఉమెన్స్ హాస్టల్ అమ్మాయి.. జ్వరంతో బాధపడుతుంటే.. జీవిత నుంచి ఫోన్ వచ్చింది. జ్వరంతో వున్న అమ్మాయిని జీవిత రాజశేఖర్ బూతులు తిట్టిందని.. ఫోన్ లిఫ్ట్ చేసిన అమ్మాయిని గట్టిగా అడిగేసరికి మొత్తం నిజాలను బయటపెట్టిందని సంధ్య తెలిపింది. 
 
హీరో రాజశేఖర్ వాడుకున్న ఇద్దరు అమ్మాయిలు స్వయంగా ఈ విషయాన్ని తన వద్దకు వచ్చి తెలిపారని.. ఇవన్నీ కల్పనలు కాదని.. సాక్ష్యాధారాలు కూడా వున్నాయని సంధ్య స్పష్టం చేశారు. ఇలా జరిగిందని అప్పట్లో ఓ ప్రముఖ పత్రికకు ఫోన్ లిఫ్ట్ చేసిన అమ్మాయి లేఖ కూడా రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంత చేసిన.. జీవిత ఏ మొహం పెట్టుకుని కాస్టింగ్ కౌచ్‌పై ప్రకటన చేస్తుందని సంధ్య ప్రశ్నించారు.