1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2023 (16:43 IST)

వెంకటేష్ సైంధవ్ టీజర్ అక్టోబర్ 16న - సంక్రాంతికి సినిమా విడుదల

Venkatesh, Saindhav
Venkatesh, Saindhav
వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘సైంధవ్’ ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.
 
ఈ చిత్రం టీజర్‌ను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లతో కూడిన భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
 
గతంలో విడుదలైన చిత్రం గ్లింప్స్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసింది. టీజర్ ప్రేక్షకులకు ‘సైంధవ్’ వరల్డ్ గురించి ఇన్ సైట్ ఇవ్వనుంది.
 
స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఎస్ మణికందన్ డీవోపీగా పని చేస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్