శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 1 జులై 2020 (16:52 IST)

5 మిలియ‌న్స్ వ్యూస్‌ని క్రాస్ చేసిన యాక్ష‌న్ హీరో విశాల్ `చ‌క్ర` ట్రైల‌ర్

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ నాలుగు ద‌క్షినాది భాష‌ల్లో ఒకేసారి యాక్ష‌న్‌ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌` ట్రైల‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్‌‌ డైలాగ్స్‌తో ఉత్కంఠ‌భ‌రితంగా సాగే ఈ ట్రైల‌ర్ విడుద‌లైన అన్ని భాష‌ల‌లో ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే 5 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్‌ని దాటి సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ని ఆద‌రిస్తున్న వారంద‌రికి విశాల్ ద‌న్య‌వాదాలు తెలిపారు.
 
బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో సరికొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `చ‌క్ర` పోస్ట‌ర్, గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. హీరోయిన్‌గా పోలీస్ ఆఫిస‌ర్ పాత్ర‌లో శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది.
 
ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ హీరో విశాల్‌,  శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.