శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (20:43 IST)

లాక్ డౌన్ ముందే తెలుసు.. ప్రియుడికి దూరంగా వుండలేకపోతున్నా.. గుత్తా జ్వాలా

చైనాలోని వుహాన్ నగరం నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ గురించి బాడ్మింటన్ క్రీడాకారిణి, సినీ నటి గుత్తా జ్వాలా ఆసక్తికర కామెంట్లు చేసింది. చైనాలోని షాంఘైలో ఉన్న తన మామగారు అక్కడి పరిస్థితి డిసెంబరులో తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పుకొచ్చింది.

వుహాన్‌లోని దారుణ పరిస్థితులు అప్పుడే తమకు తెలియవచ్చాయని చెప్పింది. దీంతో భారత్‌లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించి.. తాను మానసికంగా సిద్ధమైనట్లు గుత్తా జ్వాలా వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధిస్తారనే విషయం మూడు నెలల క్రితమే తెలుసునని గుత్తా జ్వాలా తెలిపింది. 
 
అయితే తన ప్రియుడిని నుంచి ఇలా దూరమవుతానని మాత్రం ఊహించలేదు. ఇలా సుదీర్ఘంగా దూరం ఉంటానని ఊహించగలిగితే ముందే జాగ్రత్త పడేదానిని అని గుత్తా జ్వాలా చెప్పుకొచ్చింది. మూడు నెలలుగా ఆయనను చూడలేదని..రెండేళ్లుగా డేటింగ్‌లో వున్నాం. కానీ ఇలా ఇన్ని రోజులు దూరంగా వుండలేకపోతున్నానని గుత్తా జ్వాలా వెల్లడించింది.
 
క్వారంటైన్ సమయంలో ఇంట్లో ఉండటం చాలా బోర్‌గా ఉంది. కానీ పేద ప్రజల గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుందని గుత్తా జ్వాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపోతే.. కొద్ది రోజుల క్రితం తన ప్రియుడు, తమిళ నటుడు విష్ణు విశాల్‌తో ఎడబాటు భరించలేకపోతున్నాను అంటూ ట్వీట్ చేయడం మీడియాలో హైలెట్‌గా మారింది.

తన ప్రియురాలు బాధపడుతున్న విషయాన్ని గ్రహించిన ఆయన.. దేశ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని రోజులు అలా దూరంగా ఉందాం అని విష్ణు విశాల్ సమాధానం ఇచ్చారు.