1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (17:26 IST)

కరోనా మహమ్మారి.. ఇటలీలో మే 3 వరకు లాక్ డౌన్

కరోనా వైరస్‌ పుట్టింది చైనాలో అయినా దానివల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశం మాత్రం ఇటలి. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 1,03,512 మంది మృతి చెందారు. ఇందులో 19 వేల మంది ఇటలీకి చెందినవారే ఉన్నారు. మొత్తంగా దేశంలో లక్షా యాభైవేల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని మార్చి 10 నుంచి అమ గియుసెప్‌ కాంటే ప్రకటించారు. కరోనా వైరస్‌ను వాప్తిని నిరోధించడానికి మార్చి 10న లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 17,10,798 మంది కరోనా వైరస్‌ బారిన పడగా, 1,03,512 మంది మరణించారు.
 
మరోవైపు భారత దేశంలో లాక్‌డౌన్‌ లేకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. శనివారం మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

భారత్‌లో మొత్తం 7,447 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు నమోదు కాగా, ఇవాళ ఒక్కరోజే 40మంది మృత్యువాత పడ్డారు. ఇక కరోనాతో కోలుకుని ఇప్పటివరకూ 642మంది డిశ్చార్జ్‌ అయినట్లు లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.