బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (15:17 IST)

కరోనాకు వ్యాక్సిన్.. సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే..

కరోనా వైరస్ నియంత్రించేందుకు వ్యాక్సిన్‌ సెప్టెంబర్ నాటికి సిద్ధం కావొచ్చునని ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని వ్యాక్సినాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ బృందం ప్రకటించింది. రాబోయే 15 రోజుల్లో తమ బృందం మానవులపై కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తుందని ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ చెప్పారు. ఈ టీకాపై 80 శాతం నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 
 
ఈ టీకాకు సంబంధించిన పరీక్షా ఫలితాలు సక్రమంగా ఉంటే, ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి నిధులు విడుదల చేస్తుందని అన్నారు. అయితే టీకాను కనుగొనేంతవరకు వరకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని అన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది కరోనా బారిన పడి మృతి చెందారు. అందుకే కోవిడ్ -19 టీకా దిశగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆక్స్‌ఫోర్డ్ శాస్త్రవేత్తలు ఈ పనిని ముమ్మరం చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ఒక్క వారం రోజుల్లోనే బ్రెజిల్‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య మూడింత‌లు పెరిగింది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1056 మంది చ‌నిపోయారు. బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలకు చేరుకుంది.