మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (16:14 IST)

కారకోరం పర్వత శ్రేణుల్లో మంచు చిరుత.. ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం

కరోనా వైరస్ పుణ్యమాని ప్రపంచ స్తంభించిపోయింది. అంతర్జాతీయ సరిద్దులు మూతపడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. దీంతో వన్యప్రాణులు, మృగాలకు స్వాతంత్ర్యం వచ్చినంతగా స్వేచ్ఛగా వివహరిస్తున్నాయి. పైగా, వాహనరాకపోకలన్నీ బంద్ కావడంతో కాలుష్యం కూడా పూర్తిగా తగ్గిపోయింది 
 
ఈ పరిస్థితుల్లో కారకోరం పర్వతశ్రేణుల్లో ఓ అరుదైన మంచు చిరుత కనిపించింది. ప‌ర్వ‌త‌ప్రాంతంలో ఓ శిల కింద ఉన్న మంచు చిరుత వింత‌గా అరుస్తున్న‌పుడు 'ది వైట్ ల‌య‌న్ ఫౌండేష‌న్' ఈ వీడియోను చిత్రీక‌రించింది.
 
కార‌కోరంలో ఎక్క‌డ ఈ వీడియో తీశారో తెలియ‌దుగానీ, ఆప్ఘ‌నిస్తాన్‌లోని వ‌ఖాన్ కారిడార్ నుంచి అక్సాయిచిన్ వ‌ర‌కు 500 కిలోమీట‌ర్ల పొడ‌వులో కారకోరం రేంజ్ (కారకోరం ప‌ర్వ‌త‌శ్రేణి) విస్త‌రించి ఉంటుంది అంటూ ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు.
 
మరోవైపు, ఇండోనేషియాలోని అనాక్‌ క్రాకటౌ అగ్నిపర్వతం బద్దలైంది. సుందా దీవిలో ఉన్న అగ్నిపర్వతం దేశంలో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లో ఒకటని జియోలాజికల్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ అధికారులు తెలిపారు. 
 
శనివారం తెల్లవారుజామున 40 నిమిషాలపాటు సంభవించిన విస్ఫోటనంతో పెద్దఎత్తున దుమ్ము వెదజల్లిందని, దీంతో 500 మీటర్లకు పైగా ఎత్తులో పొగ కమ్ముకు పోయిందని పేర్కొన్నారు. ఈ అగ్నిపర్వతాన్ని 1927లో కనుగొన్నారు.