శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (14:18 IST)

జనతా కర్ఫ్యూ- ఇండోర్‌లో తెరిచేవున్న మద్యం షాపులు..

Indore
జనతా కర్ఫ్యూకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది, ప్రజలు తమ ఇళ్లలోనే తమను తాము నిర్భంధించుకుంటున్నారు. కానీ దేశంలోని పరిశుభ్రమైన నగరం ఇండోర్ ఇబ్బందికరమైన వార్తలను వినాల్సి వస్తుంది. ఇండోర్‌లో లాక్‌డౌన్ మధ్యలో, కొన్ని చోట్ల మద్యం షాపులు తెరిచారు, ప్రజలు కూడా మద్యం సీసాలు కొంటున్నారు.  
 
వెబ్‌దునియా ప్రతినిధి తన కెమెరాకు పనిచెప్పారు. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు. మద్యం దుకాణదారులు కూడా భయం లేకుండా మద్యం విక్రయిస్తున్నారని గమనించారు. దేశంలో కర్ఫ్యూ పరిస్థితి ఉన్నప్పుడు, నగరాల్లో మందులు చిలకరించడం జరుగుతుంది. దాదాపు కర్ఫ్యూ కారణంగా పెద్ద, , చిన్న సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి. అటువంటి పరిస్థితిలో, ఇండోర్ నగరంలో మద్యం షాపులు తెరవడం షాకిచ్చింది. నగరంలోని పలుచోట్ల మద్యం షాపులు తెరిచి వుంచడం వాటిని ప్రజలు కొనడాన్ని వెబ్‌దునియా వెలుగులోకి తెచ్చింది. 
Indore
 
ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మద్యం దుకాణాల మూసివేత విషయంలో పరిపాలన నిస్సహాయంగా ఉంది. ఇంతవరకు మద్యం దుకాణాలను మూసివేయాలని తమకు ఎలాంటి సూచనలు రాలేదని ఉన్నతాధికారులు అంటున్నారు. ప్రధాని విజ్ఞప్తి మేరకు అన్ని సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయబడినప్పుడు, మద్యం దుకాణాలు ప్రజలకు ఎందుకు ముప్పుగా ఉన్నాయి. 
Indore
 
ఈ వ్యవహారంపై ఇండోర్ కలెక్టర్, లోకేష్ జాతవ్ మాట్లాడుతూ.. ఇంకా మద్యం షాపుల విషయమై సూచనలు రాలేదు. ఇప్పటికే నగర ప్రాంగణం, బార్లు, క్లబ్బులు, పబ్బులు మూసివేయబడ్డాయి. మద్యం దుకాణాల మూసివేతకు సంబంధించి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. లాక్డౌన్ వ్యవధి పెరిగితే, వారు కూడా తగిన నిబంధనల ప్రకారం తీసుకుంటారని సెలవిచ్చారు.