సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (10:46 IST)

జనతా కర్ఫ్యూ అమలు.. కరోనా వైరస్ మటాష్ కావాల్సిందే..

జనతా కర్ఫ్యూ అమలులో వున్న నేపథ్యంలో కరోనా వైరస్ మటాష్ కావాల్సిందేనని వైద్య అధికారులు చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ అమలు నేపథ్యంలో ఆదివారం మార్చి 22, ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు కచ్చితంగా ఇళ్లల్లోనే ఉండాలి. 
 
వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్త తీసుకున్న ఇలాంటి మహమ్మారి వైరస్‌లను ఎదుర్కోలేం. అందుకే జనతా కర్ఫూను పాటించాలి. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అదే సమయంలో 12 గంటల వ్యవధిలో వైరస్‌ దానంతట అదే నశిస్తుంది. ఇంట్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మీ పిల్లలు, వయసు పైబడిన వారిని ఇంటి నుంచి బటయకు వెళ్లకుండా చూసుకోండి. ఇంట్లో ఉన్నాం కదా అని కుటుంబసభ్యులను తాకడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయవద్దు.
 
చేతుల్ని శానిటైజర్లతో శుభ్రంగా కడుక్కుంటూ ఇంట్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా నియంత్రించవచ్చు. తెలంగాణలో అయితే మార్చి 22న ఉదయం 6గంటల నుంచి సోమవారం (మార్చి 23) ఉదయం 6 గంటల వరకు జనతాకర్ఫ్యూ అమలులో ఉంటుంది. మన ఆరోగ్యం కోసం అందరూ కర్ఫ్యూను ఉల్లంఘించకూడదని కేంద్రం ప్రకటించింది