శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 ఏప్రియల్ 2020 (19:32 IST)

లాక్ డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15 నాటికి 8,00,000 మందికి కరోనా: లవ్ అగర్వాల్

భారతదేశం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రశంసించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించడమే కాదు... దాన్ని పగడ్బందీగా ఎలా అమలు చేయాలన్నదానిపై ఖచ్చితమైన ప్రణాళిక వుండాలి. అలా లేనట్లయితే లాక్ డౌన్ విధించినా ఫలితాలు శూన్యమేనని కొన్ని దేశాలు నిరూపిస్తున్నాయి. 
 
ఇకపోతే లాక్ డౌన్ గురుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ శనివారం నాడు విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో లాక్ డౌన్ విధించకుండా వున్నట్లయితే కోవిడ్ -19 కేసులు ఏప్రిల్ 15 నాటికి 8.2 లక్షలకు చేరే అవకాశం వుండేదని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగామన్నారు.
 
కాగా గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు, 40 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,447కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులకు అవసరమైన చికిత్స సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో వుంచుతున్నట్లు చెప్పారు.