కె.టి.ఆర్.తో లంచ్ - సేవల గురించి వివరించిన సోనూసూద్
KTR- sonusood meeing
ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, ఈ సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు. తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన\ అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి మంచి చేస్తూనే వివిధ కంపెనీలురావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ అన్నారు.
Actor #SonuSood and Minister #KTR in conversation with other film fraternity members about the decentralisation of healthcare infrastructure plan in #Telangana @KTR @SonuSood @MeherRamesh @directorvamshi pic.twitter.com/W8sXOlitEY
— BARaju's Team (@baraju_SuperHit) July 6, 2021
ఈ సమావేశానంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్ కు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి.. ఒక మేమొంటో ను మంత్రి కేటీఆర్ అందజేశారు.
తర్వాతి కథనం
