సంబంధిత వార్తలు
- శ్రీవారి లడ్డూ వివాదం.. నెయ్యి కల్తీ కాలేదు.. ఆవు కల్తీ అయింది.. : వైకాపా నేత తమ్మినేని సీతారాం
- ఎన్టీఆర్ చాలాకాలం తర్వాత ఎమోషనల్ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు.. నాగవంశీ
- అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్
- మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ... ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన
- నేడు విజయవాడ వరద బాధితులకు వరదసాయం పంపిణీ : సీఎం చంద్రబాబు
దేవర సెన్సార్ రిపోర్ట్ వచ్చాకే ట్రిమ్ చేశారు? దేవర ప్రివ్యూ రిపోర్ట్
Devara preview poster
అంతా బాగానే వుంది. కానీ సినిమా రిజల్ట్ పై చిత్ర టీమ్ తాము పడ్డ కష్టంతో మంచి సినిమా తీశామని నర్మగర్భంగా చెబుతున్నారు. కానీ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం కథ వేరేలా వుంది. సెకండాఫ్ చాలా లాగ్ గా వుండడం, ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా వుందని ఓ సభ్యుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కథ సముద్ర దొంగల నేపథ్యం కనుక హింస కూడా పరాకాష్టలా వుంటుందని ట్రైలర్ ను బట్టే తెలుస్తోంది.
కథ ప్రకారం తీసుకుంటే ఎన్.టి.ఆర్. తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. తండ్రి పాత్ర మొదటి పార్ట్ లోనే ఎక్కువగా వుంటుంది. చివరలో కొడుకు పాత్ర వుండబోతోంది. ఆ ఎపిసోడ్ కు జాన్వీకపూర్ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆమె కేవలం 10 నిముసాల నిడివి మాత్రమే వుంటుందట. అందులో రెండు పాటలు ఆమెపై వుంటాయని సమాచారం. ఆర్.ఆర్.ఆర్.లో రామ్ చరణ్ భార్య పాత్ర నిడివికి మించి వుండదనే పోలిక కూడా చేసినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలు కనుక రెండో భాగంలో యువ ఎన్.టి.ఆర్. తన తండ్రి కోసం ఏం చేశాడనేది దర్శకుడు చెప్పనున్నాడని తెలిసింది.
ఇక మూడుగంటల నిడివిగల ఈ సినిమాను సెన్సార్ రిపోర్ట్ వచ్చాక ఎడిటింగ్ కు పనిచెప్పారట. అందులో 15నిముషాలపాటు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. అయినా ఇంకా తగ్గించాల్సి వుందని ఎడిటర్ చెప్పినట్లు కూడా వార్త బయట వినిపస్తుంది. ఇటీవలే దర్శకుడు కొరటాల మాట్లాడుతూ, చిరంజీవి నటించిన ఆచార్య గురించి చెబుతూ, కొన్ని కారణాలవల్ల తప్పిదం జరిగిందని అన్నారు. మరి దేవరలో కావాల్సినంత ఫ్రీడమ్ వుంది. నిర్మాతలు కూడా దర్శకుడికి బంధువులే కావడంతో మరి ఈ సినిమా ఏ స్థాయిలో తీసివుండాలి అనే టాక్ కూడా వుంది. కనుకనే ముందుగానే టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా మొదటి మూడురోజులు ఫుల్ అవుతాయని తర్వాత ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేవర యూనిట్ పడ్డ కష్టానికి ఫలితం వస్తుందోలేదో.. చూద్దాం ఏం జరుగుతుందో.
