గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (10:27 IST)

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ... ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన

rain
మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేవరుప్పలలో సోమవారం గరిష్టగా 11.5 శాతం సెంటిమీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది. నిజానికి గత మూడు రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అకారణంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, సోమవారం జనగామ జిల్లా దేవరుప్పలో అత్యధికంగా 11.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌లో అత్యల్పంగా 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.