గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (21:16 IST)

రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. చిన్నపిల్లాడిపై దాడి.. అమ్మ ఎలా కాపాడిందంటే? (Video)

Dog Attack
Dog Attack
కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం అనేక చోట్ల ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన ఏడు నెలల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా దాదాపు ఆరువేల మంది కుక్కల దాడిలో గాయపడ్డారని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 50వేల కుక్కలు వుంటాయని.. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే పదివేలకు పైగా వుంటాయని అంచనా. 
 
ఇకపోతే.. తాజాగా కరీంనగర్‌లో ఓ పిల్లాడిపై కుక్కలు దాడి చేసేందుకు తెగబడ్డాయి. చిన్న పిల్లలు అలా రోడ్డుపై తిరగనివ్వట్లేదు. ఓ ముస్లిం మహిళ తన బిడ్డతో రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా ఓ నాలుగైదు శునకాలు పిల్లాడిపై దాడికి పాల్పడ్డాయి. అయితే వెంటనే అప్రమత్తమైన ముస్లిం మహిళ కుక్కల బారి నుంచి తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.