ఆదివారం, 19 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (17:14 IST)

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

Sharwanand
Sharwanand
శర్వానంద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Sharwa38 కోసం మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నందితో చేస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై  హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్‌ ప్రతిష్టాత్మకంగాఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
 
ఇది1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా.  
 ఇంతకు ముందెన్నడూ చూడని ఎలిమెంట్స్ తో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ మూవీగా వుండబోతోంది.
 
సబ్జెక్ట్ యూనివర్సల్ అప్పీల్ వుండటంతో మేకర్స్  దీనిని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.శర్వా, సంపత్ నంది ఇద్దరికీ ఇది మెడిన్ పాన్ ఇండియా మూవీ.
 
సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేసిన దర్శకుడు, శర్వాను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు, 60ల నాటి క్యారెక్టర్ ని పోషించేందుకు శర్వా కంప్లీట్ గా మేకోవర్‌ అయ్యారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మంటలు చెలరేగుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా వుంది. సౌందర్ రాజన్ ఎస్ కెమెరామ్యాన్ గా పని చేస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
 
ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.  #Sharwa38 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,  హిందీ భాషల్లో విడుదల కానుంది.