గురువారం, 7 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (15:05 IST)

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

Sharwanand, Ananya
Sharwanand, Ananya
శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో వచ్చిన జర్నీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. తమిళ్ డబ్బింగ్ మూవీగా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. 2011 డిసెంబర్ 16న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. జర్నీ పాటలు అప్పటి కుర్రకారుని కట్టి పడేశాయి. రెండు ప్రేమ కథలు సమాంతరంగా చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు నాటి మ్యాజికల్ లవ్ స్టోరీని లక్ష్మీ నరసింహ మూవీస్ మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది.
 
అసలే టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 21న జర్నీ మూవీని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దాదాపు పన్నెండేళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుప్రియ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.
 
హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ మూవీగా వచ్చిన జర్నీ మూవీ తెలుగులో భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఇప్పటి ఆడియెన్స్ ఎలా ఆకట్టుకుంటుందో.. అప్పటి ఆడియెన్స్‌కు ఎంతలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుందో చూడాలి. ఆల్రెడీ బుకింగ్స్ జోరందుకున్నాయని బుక్ మై షో ట్రెండ్ చూస్తే తెలుస్తోంది.