నేను అధికారంలోకి వస్తే కూటమి నాయకుల్ని ఇదే జైలులో వేస్తా.. జగన్ (video)
ప్రస్తుతం గుంటూరు సబ్ జైలులో నిర్బంధంలో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కు సంఘీభావం తెలిపేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు వచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెల్లవారుజామున తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా జైలుకు వెళ్లి సురేష్‌ను కలిశారు. పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళిత నాయకుడిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా "అక్రమ అభియోగాలు"గా అభివర్ణించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. సురేశ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఆయనకు తన తిరుగులేని మద్దతును తెలిపారు.
ఇంకా తాను అధికారంలోకి రాగానే మిత్రపక్ష నాయకులను ఇదే జైలులో పెడతానని జగన్ ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదని.. తాము కూడా అదే రెడ్ బుక్ మైంటైన్ చేస్తే మీరు ఒక్కడు కూడా మిగలరు అంటూ జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

"మీ 5 ఏళ్ళ తర్వాత నా 5 ఏళ్ళు వస్తాయి, అప్పుడు కూటమి నాయకులందరినీ తెచ్చి ఇదే జైలు లో వేస్తాను" - #YSJagan#ChandraBabu #PawanKalyan pic.twitter.com/avmbiRvErG
— Daily Culture (@DailyCultureYT) September 11, 2024