గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (18:01 IST)

ఆ మూడు బోట్లు వైకాపావేనా? ప్రకాశం బ్యారేజీ మీదకు వదిలేశారు.. జగన్ కుట్ర? (video)

Boats
Boats
ప్రకాశం బ్యారేజీని కూల్చి విజయవాడని జల సమాధి చేయటానికి ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి పన్నిన భారీ కుట్ర బట్టబయలు అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 
జగన్ నమ్మిన బంటు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్‍‌కి చెందిన మూడు వైసీపీ బోట్లని ఒకదానికి ఒకటి కట్టేసి, మూడు కలిపి ఒకేసారి ప్రకాశం బ్యారేజీ మీదకు వదిలేసారు.
 
సరిగ్గా బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలోనే, ఇలా చేసి బ్యారేజీ కూల్చేయాలని వైకాపా నేతలు ప్లాన్ వేశారని.. అయితే అదృష్టవశాత్తు బ్యారేజీకి ఎక్కువ నష్టం జరగలేదని టీడీపీ ఆరోపిస్తోంది. 
 
ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు ఢీకొనడంతో వివాదం, ఆరోపణలు రావడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు విచారణ మొదలు పెట్టటంతో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం  మేనల్లుడు కోమటి రామ్మోహన్‍, ఉషాద్రి పారిపోయారు. దీనిపై విచారణ కొనసాగుతుంది.
 
బ్యారేజీని ఢీకొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే బోట్లను తిప్పారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ అనుమానంతో ఢీకొన్న బోట్ల యాజమాన్యంపై పోలీసులు విచారణ చేపట్టారు. 
 
బ్యారేజీలోకి దూసుకెళ్లే ముందు బోట్లను ఒకే గొలుసుతో కట్టి ఉంచారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన పడవలు వైఎస్‌ఆర్‌సీపీ నేతలవేనని, ఢీకొట్టడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.