గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (16:50 IST)

వరద సాయంగా పవన్ కళ్యాణ్ రూ.6 కోట్లు.. రామ్ చరణ్ రూ.కోటి

pawan kalyan
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందించనున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే, వరద ప్రభావిత గ్రామాలకు కూడా విరాళం ప్రకటించారు. ఏపీలోని 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయని, ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపించనున్నట్టు తెలిపారు. తన వంతుగా మొత్తం రూ.4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అలాగే, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయ నిధికి తలా రూ.కోటి చొప్పున రూ.2 కోట్ల సాయం చేయనున్నట్టు తెలిపారు.
 
మరోవైరు, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, హీరో రామ్ చరణ్ కూడా దాతృత్వం చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు. 
 
'వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా.. అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయమిది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా' అని పోస్ట్‌ పెట్టారు.