మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (11:08 IST)

ముంబైలో ప్రత్యక్షమైన హార్దిక్ పాండ్యా మాజీ భార్య!

natasha
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ఉన్నట్టుండి ముంబైలో ప్రత్యక్షం కావడం ఇపుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. 2020 మే 31న కరోనా సమయంలో హర్ధిక్ పాండ్య, నటాషా ప్రేమ వివాహం చేసుకోగా, వారికి అదే ఏడాది బాలుడు (అగస్త్య) పుట్టాడు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తాము విడిపోవాలని పరస్పరం
నిర్ణయించుకున్నామని ఇద్దరూ ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే కో పేరెంట్స్‌గా ఆగస్త్యకి తాము చేయాల్సింది అంతా చేస్తామని పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో పాండ్యాతో విడిపోయినట్లు ప్రకటించిన తర్వాత అగస్త్యను తీసుకుని నటాషా తన స్వదేశం సెర్బియా వెళ్లిపోయింది. అక్కడే కుమారుడి నాలుగో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంది. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
మరో వైపు క్రికెట్ కెరీర్‌‌లో బిజీగా ఉన్న హార్దిక్ పాండ్యా తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ తరుణంలో పాండ్యా మాజీ భార్య నటాషా మళ్లీ ముంబైకి చేరుకోవడం ఇపుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. తన ముంబై పర్యటనకు సంబంధించిన ఫోటోలను నటాషా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. అయితే ఇందులో కుమారుడు అగస్త్య కనిపించలేదు. నటాషా ముంబైకి ఎందుకు తిరిగి వచ్చింది అనే దానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు.