గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:00 IST)

బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ : ఏపీ - తెలంగాణాల్లో వర్షాలు

rain
బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని థాయ్‌లాండ్‌కు చెందిన ఉత్తర వైపున మరో సర్క్యులేషన్ ఏర్పడిందని పేర్కొంది. ఈ రెండు సర్క్యులేషన్లు అల్పపీడనానికి దారితీస్తాయని అంచనా వేసింది. దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
ఈ నెల 23వ తేదీ సోమవారం ఆంధ్రప్రదేశ్, యానాంలో, 23 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణాలో 24, 25వ తేదీల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపగ్రహ అంచనాల ప్రకారం, ఆదివారం మధ్యాహ్నం నుంచి తెలుగు రాషఅటరాలు మేఘావృత్తమై ఉంటాయని చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత రెండు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.