మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (09:17 IST)

గణేశ నిమజ్జన శోభాయాత్ర చూశాడు.. బైకుపై వస్తుండగా ఇంటర్ విద్యార్థి హత్య

murder
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను చూసి తన స్నేహితుడితో కలిసి తిరిగి వస్తున్న 17 ఏళ్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని మోటారు సైకిల్‌పై వచ్చిన వ్యక్తి హత్య చేశాడు. బాధితుడు బి. ధీరజ్, అతని స్నేహితుడు ప్రసాద్ బైక్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా ముషీరాబాద్‌లో వి.విజయ్ అనే వ్యక్తి అడ్డగించినట్లు పోలీసులు తెలిపారు. 
 
వారిద్దరి మధ్య వాగ్వాదం తర్వాత విజయ్ అకస్మాత్తుగా ధ్రీజ్‌ను కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధీరజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.